GDWL: ఆర్టీసీ రక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ గద్వాల డిపో ముందు జేఏసీ నాయకులు బుధవారం సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 30% ఫిట్మెంట్తో వేతన సవరణ, మహాలక్ష్మి పథకం బకాయిల విడుదల వంటి 12 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే, పనిభారం తగ్గించాలని, ఖాళీలను భర్తీ చేయాలన్నారు.