MBNR: కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల మాజీ మంత్రి డాక్టర్ సీ. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పన్నిన కుట్రలు భగ్నమయ్యాయని మండిపడ్డారు. న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడి నిజాన్ని గెలిపించారని పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టుపై అనవసర విమర్శలు తగవని ఆయన హితవు పలికారు.