SRD: సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం)గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.