WNP: జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫస్ట్ ఇయర్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ తెలిపారు. BA, BCOM, BSC తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్ లైన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.