VZM: ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని వివిధ పనుల నిమిత్తం ఎస్.కోట వచ్చే ప్రజలకు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు పట్టణ సీఐ నారాయణమూర్తి పోలీసు స్టేషన్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఇవాళ ప్రారంభించారు. ఎస్.కోట అరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండడంతో దాహార్తి తీర్చేందుకు మజ్జిగ తాగడం వలన ఉపశమనం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.