MDCL: మేడ్చల్ పరిసర ప్రాంతాలలో వేసవి వేళ పదేపదే విద్యుత్ సరఫరాల అంతరాయం ఏర్పడుతుండగా, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. కరెంట్ సరఫరా సమస్యలతో కనీసం ఆన్లైన్ చెల్లింపులు సైతం జరగడం లేదని, కమర్షియల్ వ్యాపారులు తెలిపారు. అధికారిక యంత్రాంగం మరోసారి ఈ సమస్యను పునరావృతం కాకుండా చూడాలని వెంకటేశ్వర నగర్ వాసులు కోరారు.