MDK: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రైవేట్ బస్సులు, తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మె కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆమె కోరారు.