TG: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మేలు జరిగిందని బీఆర్ఎస్ నేతలు సంతోష పడొద్దని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్దమే అని కోర్టు తెలిపిందన్నారు. తాత్కాలికంగా మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు ఇచ్చిందన్నారు. ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు లాబీయింగ్‌కు పాల్పడ్డట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు.