NLG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ప్రకటించారు. ఈ సెలవులు కేవలం విద్యార్థులకు మాత్రమేనని, వర్సిటీ పరిపాలన, పరీక్షల విభాగం, ప్రిన్సిపల్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. జూన్ 1న కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.