AKP: మాడుగుల పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ఇవాళ వెలుగు వీవోఏలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి వీలు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.