BHNR: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కేవలం ఇన్స్టారీల్స్తో నియోజకవర్గం అభివృద్ధి చెందదని, సమస్యలపై ఆయనకు కనీస అవగాహన లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫ్లోరోసిస్ నిర్మూలన, సాగు-త్రాగు నీటి ప్రాజెక్టులు చేపట్టామని గుర్తు చేశారు.