NLG: నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం బుధవారం రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని మద్దతు ధరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో వసతులు కల్పించి, తూకం, చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు.