KDP: విద్యార్థుల ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలే బలమైన పునాది అని మండల ప్రధాన కార్యదర్శి సమీర్ బాషా పేర్కొన్నారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సిద్ధవటం మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.