AP: విజయవాడ ప్రభుత్వం ఆయుర్వేద వైద్య కళాశాలను మహిళా కమిషన్ సందర్శించింది. విద్యార్ధినులపై ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ వచ్చారు. విద్యార్ధినులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు ఆమె తెలిపారు. లైంగిక వేధింపులు నిజమేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.