SRCL: నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లెల్ల రైతు వేదికలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని ఏఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. భూసార పరీక్షలు, అగ్రి స్టాక్‌పై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 2వ దశ ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, కావున రైతులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరుకావాలని ఏఈఓ కోరారు.