AP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. CBNను తన ఆప్తమిత్రుడిగా, కష్టపడే నేతగా ప్రధాని అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని కొనియాడారు. చంద్రబాబు నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకు భగవంతుడు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మోదీ తన సందేశంలో ఆకాంక్షించారు.