డెంగీ నివారణ దిశగా భారత్ చారిత్రక అడుగు వేసింది. దేశంలోనే డెంగీ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ (TAK-003) అత్యవసర వినియోగానికి DCGI పరిధిలోని నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ఫార్మా సంస్థ ‘తకేడా’ ఈ టీకాను అభివృద్ధి చేసింది. డెంగీలోని 4 రకాల వైరస్‌లపై ఇది పనిచేస్తుంది. 4-60 ఏళ్ల వయసున్న వారు ఈ టీకా తీసుకోవచ్చు.