NZB: సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కొండూరు, సర్పల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ సీఈవో గిరి ప్రారంభించారు. రైతులకు సౌకర్యవంతంగా పంట విక్రయాల కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఈవో తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ ఛైర్మన్ చెల్లెం గంగాధర్, డైరెక్టర్ నాయిడి చిన్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.