MHBD: ఆర్టీసీ సమ్మెలో భాగంగా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా నిన్న రాత్రి తొర్రూరు గౌడ సంఘం నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.