ATP: ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏఈ దాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ మరమ్మతుల కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరాని చేస్తామన్నారు.