ASF: సిర్పూర్ (యు) MRO కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫెరోజ్ ఖాన్ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఫెరోజ్ ఖాన్ మృతి పట్ల రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.