TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కాసేపట్లో తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ మునీరాబాద్‌లో 20 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు. 50 వేల మందికి పైగా జాగృతి కార్యకర్తలు హాజరు కానున్నారు. వారి కోసం 34 రకాల వంటకాలు రెడీ చేస్తున్నారు. తలకాయ కూర, బోటి, నాటుకోడి పులుసు, హైదరాబాద్ చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, మక్క గారెలు, సర్వపిండి, జిలేబీ, బూరెలు, అరిసెలు నోరూరించనున్నాయి.