TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గుర్తుతెలియని అగంతకుడు టెర్మినల్‌లో బాంబు ఉందని మెయిల్ పంపినట్లు సమాచారం. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేల్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.