GDWL: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ కార్మికులు శనివారం విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లాధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. జేఏసీ నాయకులతో జరిగిన చర్చల మేరకు ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె విరమణతో బస్ సర్వీసులను యధాతథంగా పునరుద్ధరించారు.