MLG: జిల్లాలో ఇద్దరు స్నేహితులు నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం మసీదు సమీపంలో దొరికిన మొబైల్‌ను మోహన్, అశోక్ వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాల్స్ ద్వారా యజమాని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పావని అని గుర్తించి సమాచారం అందించారు. అనంతరం ఎస్సై చంద్రశేఖర్ సమక్షంలో మొబైల్‌ను ఆమెకు అప్పగించారు. పోలీసులు మోహన్, అశోక్‌లను అభినందించారు.