BHPL: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ చేసి బాధితునికి అప్పగించారు. దామరంచపల్లికి చెందిన అనిల్ కుమార్ రెండు నెలల క్రితం తన ఫోన్‌ను కోల్పోయాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. CEIR పోర్టల్‌లో IMEI నెంబర్ ఆధారంగా మొబైల్ లోకేషను కనుగొన్నారు. ఇవాళ SI త్రిలోక్‌నాథ్ రెడ్డి బాధితుడికి మొబైల్‌ను అందజేశారు.