NLG: ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తొలగించిన అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్రమంగా విధుల్లో కొనసాగుతున్నారు. అధికారుల అండతో ఈకేవైసీ, డేటా ఎంట్రీ వంటి కీలక విభాగాల్లో చక్రం తిప్పుతూ, డాక్యుమెంట్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు.