SDPT: బెజ్జంకి పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా తోట తిరుపతిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై బోయిని సౌజన్యను సిద్దిపేట వేకెన్సీ రిజర్కు బదిలీ చేశారు. పలు ఆరోపణల నేపథ్యంలోనే ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కామారెడ్డిలో వేకెన్సీ రిజర్వ్ ఉన్న తిరుపతి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.