TG: వెట్టిచాకిరి అనేది మానవ గౌరవాన్ని దెబ్బతీసే క్లిష్టమైన సమస్య అని మంత్రి వివేక్ అన్నారు. దీని నిర్మూలనకు ప్రభుత్వం, పౌర సమాజ సంస్థలు, ప్రజలందరి సమిష్టి కృషి అవసరమని అన్నారు. మానవ అక్రమ రవాణా, వెట్టి కార్మిక వ్యవస్థ నిర్మూలనపై నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సెమినార్లో ఈ వ్యాఖ్యలు చేశారు. దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడంలో వివిధ శాఖలకు చెందిన వారు పనిచేయాలని కోరారు.