W.G: పాలకొల్లు శ్రీ దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 20 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ పి. శోభారాణి ఆదివారం తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థునులు అర్హులన్నారు. పరిమిత సీట్ల దృష్ట్యా ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే కళాశాల పని వేళల్లో 8790727758, 9100420496 నంబర్స్‌ను సంప్రదించాలన్నారు.