AP: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్న ‘బ్రెడ్’ సంస్థ, తన 2000వ మైలురాయిని చేరుకుంది. ఇవాళ మంగళగిరి పీఎంశ్రీ హైస్కూల్లో ఈ గ్రంథాలయాన్ని రాష్ట్ర డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్ ప్రారంభించనున్నారు. ప్రతి స్కూల్కు 650 పుస్తకాలు, బీరువా అందిస్తోంది. విద్యార్థులే వాలంటీర్లుగా ఈ లైబ్రరీలను నిర్వహిస్తారు.