PDPL: జిల్లాలోని యువత PM ఇంటర్న్ షిప్-3 పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్ తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలలో 6 నుంచి 9 నెలల పాటు చెల్లింపుతో కూడిన ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. 18-25 సం. వయసుగల వారు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 1800116090 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.