MBNR: 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025-26 దరఖాస్తు చేసుకోవడానికి ఇదే ఆఖరి గడువు అని ఆమె స్పష్టం చేశారు.