KMR: అక్రమంగా గోవులను తరలిస్తే ‘యానిమల్ యాక్ట్’ కింద కఠిన కేసులు నమోదు చేస్తామని జిల్లా పశువైద్యాధికారి భరత్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.