MDK: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన లైసెన్స్ సర్వేయర్ల మహా ధర్నాలో మెదక్ జిల్లా సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు రాంకీ, ఉపాధ్యక్షులు నవీన్ నాయక్, వెంకటేష్, శివ, చిత్తయ్య, విజయ్, అరవింద్ తదితరులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. సర్వేయర్ల ఐక్యతను ప్రదర్శిస్తూ నిరసనను విజయవంతం చేయాలన్నారు.