SDPT: దుబ్బాక మండలంలోని పద్మనాభునిపల్లి గ్రామ రైతులు ధాన్యం తరలింపునకు లారీలు అందుబాటులో లేక తిమ్మపూర్ వద్ద సిద్దిపేట-మెదక్ హైవేపై ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో పాటు వర్షాల భయంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలని కోరారు.