ADB: ఆరుగలం కష్టపడి సాగు చేస్తున్న రైతులకు అగ్ని ప్రమాదాలు నష్టాలకు గురి చేస్తున్నాయి. యాసంగిలో కంది జొన్న మొక్కజొన్న, శనగ, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంట మొక్కలను ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు చాలా మంది రైతులు పొలం గట్టుకు నిప్పు పెడుతున్నారు. దీంతో పొలాల్లో సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు కాలిపోతున్నాయి.