ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం జిల్లాలో 40 డిగ్రీలు, భద్రాద్రి జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెల రాకముందు పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.