తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 నుంచే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులు ఈ టోకెన్లను పొందవచ్చు.