తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పరిశీలించారు. వేల మంది భక్తులకు ఉన్నతస్థాయి పారిశుద్ధ్య ప్రమాణాలతో పారదర్శక సేవలు అందించడంపై ఆమె ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలు తిరుమల మేనేజ్మెంట్ విధానాలను పాటించాలని సూచించారు. టీటీడీ టెక్నాలజీ వినియోగం అద్భుతమని కొనియాడారు.