దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై రూ.2.84 పైసలు, డీజిల్‌పై రూ.2.86 పైసలు పెరిగాయి. ఈ ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఇది నాలుగో సారి.