కోనసీమ: ఆటలు మనిషి జీవితంలో ముఖ్యమైన భాగమని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ముంగండ జడ్పీ హైస్కూల్ ఆవరణంలో ఆదివారం ఆయన వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని, వారితో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు. వాలీబాల్ మంచి క్రీడ అని, ప్రతి జట్టు క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు.