AKP: పాయకరావుపేట పట్టణం పెద పీర్ల పంజా వీధిలో దట్టి నిర్మాణానికి ఆదివారం టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. ముస్లిం సోదరుల కోరిక మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ దీని నిర్మాణానికి రూ.70,000 తన సొంత నిధులను పంజా కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జమీర్, ముస్లిం మత పెద్దలు షేక్ మస్తాన్, సుభాని, షేక్ సలీం పాల్గొన్నారు.