MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నందున అందుబాటులో ఎవరూ ఉండరన్నారు. కావున ప్రజలు ఎవరు కూడా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.