కడప జిల్లా పరిషత్ పరిధిలో నకిలీ నియామక ఉత్తర్వుల ఆధారంగా విధుల్లో చేరిన నకిలీ ఉద్యోగులకు జీతాలను నిలుపుదల చేస్తూ ZP CEO సుబ్రహ్మణ్యం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నెల 16న కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టరు ఛాంబరులో ప్రారంభమైన విచారణ పూర్తి కానందున జీతాలను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నకిలీ ఉద్యోగులకు జీతాలు నిలిపివేయాలని DDOలకు ఆదేశాలను జారీ చేశారు.