KDP: వీరపునాయునిపల్లి(M) కొమ్మద్ధి గ్రామానికి చెందిన నిమ్మకాయల నరేంద్రరెడ్డి అదృశ్యమయ్యాడు. కుటుంబ సమస్యల వల్ల 19న ప్రొద్దుటూరుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో అతని తండ్రి రమణరెడ్డి VN పల్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఎస్సై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 9121100534 నెంబర్కు సమాచారం అందించాలన్నారు.