భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నేడు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై ఉదయం 10.30 గంటల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.