TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయనుంది. 90 రోజుల కూలీ చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.5 లక్షల సాయానికి అదనంగా రూ.27 వేల లబ్ధి చేకూరనుంది. రోజుకు రూ.300 చొప్పున లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనుంది.