RR: రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో నేడు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో వెంకటరెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.