NLR: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కావలి మాజీ ఏఎంసీ ఛైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లును పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు.